శాంసంగ్ నుంచి గెలాక్సీ A16 5Gని ఆవిష్కరించింది. మొదటి ఫోన్‌తో పోలిస్తే ఈ ఫోన్ చాలా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త గెలాక్సీ A16 5G 6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు, 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ నెదర్లాండ్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభించగా.. ఈ ఫోన్ ధర వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. Galaxy A16 5G ఈ నెలలో ఇండియాలో ప్రారంభించబడనున్నట్లు సమాచారం అందుతోంది.
Read Also: Minister Atchannaidu: కౌలు రైతుల చట్టంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
Samsung Galaxy A16 5G ధర
Samsung Galaxy 16.. 4 GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 22,953కి అందుబాటులో ఉంది. Galaxy A16 5G మిడ్‌నైట్ బ్లూ, టర్కోయిస్, గ్రే రంగులలో వస్తుంది. ఈ ఫోన్ షిప్‌మెంట్ త్వరలో ప్రారంభం కానుంది.
Samsung Galaxy A16 5G ఫీచర్లు, స్పెక్స్
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 1080 X 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు సెల్ఫీ స్నాపర్ కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Exynos 1330 చిప్‌సెట్ ఉంది. Galaxy A15 5G డైమెన్సిటీ 6100+ SoCతో వస్తుంది. SoC 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
Samsung Galaxy A16 5G కెమెరా
Samsung Galaxy A16 5G Android 14-ఆధారిత One UI 6.1.1 కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది. కంపెనీ 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లను ఇస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ మోడల్‌లో మొదటిది. కెమెరా గురించి మాట్లాడితే.. Samsung Galaxy A16 5G 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్.. 2MP మాక్రో యూనిట్‌ని కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP స్నాపర్ ఉంది. ఇది Galaxy A15 5G వలె అదే కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్‌లో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC.. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్ప్లాష్‌ల నుండి ఫోన్‌ను రక్షించడానికి IP54 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. అడాప్టర్ విడిగా కొనుక్కోవాలి.