Election Results: ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్ చేయడం లేదు.. కాంగ్రెస్ అసహనం
- ఈసీ తీరుపై కాంగ్రెస్ అసహనం
- ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్ చేయడం లేదంటూ ఆగ్రహం
- ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్
- అధికారులపై బీజేపీ ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలిదశలో వెనుకబడిన తర్వాత బీజేపీ పునరాగమనం చేసి ట్రెండ్స్‌లో మెజారిటీ సంఖ్యను సాధించింది. ప్రస్తుతం.. బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హర్యానాలో ట్రెండ్‌లు మెల్లగా అప్‌డేట్ అవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ బీజేపీ, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్ ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం. మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నా.. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్ అయ్యారు. అధికారులపై బీజేపీ ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్ల కౌంటింగ్ ప్రతి ఐదు నిమిషాలకు అప్‌డేట్ అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. బాధ్యతారహితమైన, నిరాధారమైన వ్యాఖ్యలను ఈసీ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
Dhanush- Aishwarya: ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. కోర్టుకు ఇద్దరూ డుమ్మా?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనెత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు శుభవార్త వస్తుందని అన్నారు. “ఈ చిత్రం త్వరలో మారుతుంది. హర్యానా నుండి మాకు శుభవార్త వస్తుంది.. నేను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ని చూస్తున్నాను. వెబ్‌సైట్‌లోని డేటా మారడం లేదు. మా ఓటు షేర్ బిజెపి కంటే చాలా ముందుంది. ఈ సీట్లు మారతాయి.” అని తెలిపారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. మీడియాతో మాట్లాడిన గెహ్లాట్, “అంతిమంగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది భావజాల యుద్ధం, సరైన భావజాలం ఉన్న వ్యక్తులు గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలను ఎలా వేధించాలో మాత్రమే తెలుసు” అని అన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానాలో పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.
Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్‌లో టెండర్లు..
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!