Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్‌లో రాసుకున్న నిందితుడు
- బెంగళూరు మహాలక్ష్మి మర్డర్ కేసు
- నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం
- ఆత్మరక్షణ కోసం చంపినట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహాలక్ష్మి మృతదేహాన్ని గుర్తించిన 4 రోజుల తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు.
National Film Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
తన డెత్ నోట్‌లో, మహాలక్ష్మి తనను చంపాలని ముందే ప్లాన్ చేసిందని.. అంతేకాకుండా తన మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పారేయాలని అందులో ఉన్నట్లు రాయ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో.. అతను తనను తాను రక్షించుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డాడు.. మహిళ గొంతు నులిమి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాయ్ తన ఇంట్లోనే మహాలక్ష్మిని హత్య చేశాడు. మరుసటి రోజు అతను కొడవలి తీసుకుని వచ్చి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి ఇంటిని శుభ్రం చేశాడు. అయితే.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, అయితే కొడవలిని విక్రయించిన మహిళ దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Minister Satya Kumar Yadav: ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు
బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. మహాలక్ష్మి, రాయ్ బెంగళూరులోని ఓ మాల్‌లో పనిచేసి స్నేహితులుగా మారారు. 29 ఏళ్ల మహాలక్ష్మికి వివాహమైనప్పటికీ విడిగా ఉంటోంది. ఆ తర్వాత వారు ఒక సంబంధంలోకి ప్రవేశించారు. అయితే, మహాలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని రాయ్‌పై ఒత్తిడి తెచ్చిందని, ఈ వివాదం వారి మధ్య నిత్యం వాగ్వాదానికి దారితీసిందని పేర్కొంది. మహాలక్ష్మిని హత్య చేసిన తర్వాత, రాయ్ మూడు రోజుల తర్వాత ఒడిశాలోని తన ఇంటికి వెళ్లి, తన తల్లి ముందు నేరాన్ని అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. మహాలక్ష్మిని తానే హత్య చేశానని రాయ్ తన తల్లి ముందు బోరున విలపించాడు. అలాగే మహాలక్ష్మి కోసం తాను చాలా డబ్బు ఖర్చు పెట్టానని, అయితే ఆమె ప్రవర్తన తన పట్ల బాగా లేదని తన తల్లికి చెప్పాడు. సెప్టెంబర్ 2-3 తేదీల మధ్య మహాలక్ష్మి హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మృతదేహాన్ని ఆమె తల్లి సెప్టెంబర్ 21న గుర్తించారు.
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!