బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయడం వల్లే ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని, విఘ్నేశ్ ఒకే ఊరికి చెందిన వారని.. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారని 6 నెలల క్రితం విఘ్నేష్ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంతో హత్యకు దారి తీసిందన్నారు.
Read Also: Viral News: రూ.2.5 లక్షలు దోచుకున్న పనిమనిషి..! పట్టించిన వాట్సాప్ స్టేటస్..
ఒకసారి మాట్లాడుదాం అని పిలవడంతో ఇద్దరు కలిసి బద్వేలు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లు ఎస్పీ వెల్లడించారు. పెళ్ళి చేసుకోవాలంటు అమ్మాయి ఒత్తిడి చేయడంతో ముందస్తు ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అమ్మాయిని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందినట్లు ఎస్సీ పేర్కొన్నారు. నిందితుడు విగ్నేశ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. కేసును లైంగిక వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు సిపార్స్ చేస్తున్నామన్నారు. మరోవైపు.. ఈ ఘటన జరిగిన ఒక్క రోజులోనే ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
Read Also: Viral News: బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా.. సైబర్ నేరగాడికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. కట్ చేస్తే..