మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. దీంతో.. కివీస్ జట్టు 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసి 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా.. 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేయడం వల్లే భారత్ ఓటమికి దారి తీసింది. మరోవైపు.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యూహాత్మక తప్పిదం చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన తప్పులేంటో తెలుసుకుందాం…
Read Also: Viral News: బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా.. సైబర్ నేరగాడికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. కట్ చేస్తే..
1. టాస్ సమయంలో తప్పుడు నిర్ణయం:
రోహిత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పాడు. అయితే లాథమ్ టాస్ గెలవకపోవడం అదృష్టం అని చెప్పొచ్చు. బెంగళూరులో టాస్‌కు ముందు రెండు రోజుల పాటు భారీ వర్షం కురవడంతో పిచ్ కప్పబడి ఉంది. ఈ క్రమంలో పిచ్‌పై తేమ ఉంది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. బంతి చాలా స్వింగ్ కావడంతో భారత బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించారు.
2. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని నిర్ణయం:
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగగా.. కివీస్ జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. టీమిండియా మేనేజ్‌మెంట్, కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజు మ్యాచ్‌లో కివీస్ ఫాస్ట్ బౌలర్లు భారత ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశారు. దీంతో భారత్ నిర్ణయం తప్పని నిరూపించారు. అయితే.. భారత్ ఒక పేసర్‌ను కోల్పోయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. ఈ టెస్టులో 32 వికెట్లు పడగా.. అందులో ఫాస్ట్ బౌలర్లు 22 వికెట్లు తీశారు. ఇక్కడ కూడా టీమిండియా వ్యూహాత్మక తప్పిదం చేసింది.
3. ఆకాష్ దీప్‌కు అవకాశం ఇవ్వడం లేదు:
బుమ్రా, సిరాజ్‌లు భారత ప్రధాన పేసర్లు. అయితే ప్రత్యర్థి జట్టుకు షాక్‌లు ఇచ్చే విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో ఆకాశ్ దీప్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను బంతిని స్వింగ్ చేస్తున్నాడు. బెంగళూరులో మేఘావృతమైన పరిస్థితుల్లో, ఆకాష్ బౌలింగ్ న్యూజిలాండ్ జట్టుకు డేంజర్ గా మారేది. అనుకున్నంత స్థాయిలో సిరాజ్ రాణించలేదు. మూడు టెస్టులు ఆడిన ఆకాశ్ దీప్ 8 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా.. అతను కొద్దోగొప్పో బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఈ క్రమంలో.. ఆకాష్‌కు అవకాశం ఇవ్వాల్సింది.
4. వరుస ఫ్లాపుల తర్వాత కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వడం:
టెస్టుల్లో కేఎల్ రాహుల్ ఫామ్ 2021 నుంచి ప్రత్యేకంగా ఏమీ లేదు. 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు.. అతను 12 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌లలో 25.70 సగటుతో 514 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 101 పరుగులు అతని అత్యధిక స్కోరు. 2022లో అతను నాలుగు టెస్టుల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 17.13 సగటుతో 137 పరుగులు చేశాడు. అయితే 2023లో అతను మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్‌లలో 28.60 సగటుతో 143 పరుగులు చేశాడు. 2024లో ఇప్పటివరకు రాహుల్ ఐదు టెస్టుల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 33.43 సగటుతో 234 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. బెంగళూరు టెస్టులో రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు పరుగులు అవసరమైన సమయంలో 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అంతేకాకుండా.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రాహుల్ సులభమైన క్యాచ్‌ను కూడా వదిలాడు.
5. సిరాజ్ వికెట్లు తీయలేకపోవడం:
ముఖ్యమైన సమయంలో వికెట్లు తీయలేకపోవడం సిరాజ్ బలహీనత భారత్‌కు ఇబ్బందులు పెట్టింది. ఈ ఏడాది భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 16 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అతని స్ట్రైక్ రేట్ 47.7, అంటే అతను ఇన్నింగ్స్‌లో ప్రతి 47.7 బంతుల్లో వికెట్లు తీస్తున్నాడు. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ మినహా.. సిరాజ్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఈ సంవత్సరం చెత్తగా ఉంది.