కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు విదేశీగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచింది. ఆస్ట్రేలియన్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్ రెండో కెప్టెన్‌గా రిజ్వాన్ నిలిచాడు. సిరీస్ గెలిచిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. తాను టాస్, మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్ అని అన్నాడు. కాగా.. ఈ సిరీస్ నుంచి మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అయితే, కెప్టెన్‌గా అతని ఆరంభం ఓటమితో ప్రారంభం కాగా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో.. 22 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.
PAK vs AUS: ఆసీస్‌కు గట్టిదెబ్బ.. వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన పాకిస్థాన్
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. “ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. ఈ రోజు మా దేశం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా మేము అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాము. నేను కెప్టెన్‌ని మాత్రమే. టాస్, ప్రెజెంటేషన్ కోసమే. ప్రతి ఒక్కరూ నాకు ఫీల్డ్, బ్యాటింగ్ గ్రూప్, బౌలింగ్ గ్రూప్ గురించి చిట్కాలు ఇచ్చారు. ఆస్ట్రేలియాతో ఆడటం అంత సులభం కాదు. వారి ఆట శైలికి సరిపోయే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి. మా బౌలర్లు బాగా ఆడారు. ఓపెనర్లు లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు.” అని అన్నాడు.
IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్
అభిమానుల గురించి కెప్టెన్ రిజ్వాన్ ఇంకా మాట్లాడుతూ.. “వారు ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఎల్లప్పుడూ మాతో ఉంటారు. ఈ విజయాన్ని వారికి అంకితం చేయాలనుకుంటున్నాను.” అని తెలిపాడు. పాకిస్థాన్ జట్టు గత కొంతకాలంగా ఏ ఫార్మాట్‌లోనూ రాణించలేకపోయింది. అయితే తాజాగా.. గత ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించింది. వరుసగా రెండు సిరీస్‌లను గెలుచుకుంది. కాగా.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత పాక్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో.. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ చాలా కీలకం కానుంది.