దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లిజెల్ లీ ఆదివారం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2024లో అరంగేట్రం చేసింది. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌లో అజేయంగా 150 పరుగులు చేసి అద్భుత రికార్డు సృష్టించింది. హోబర్ట్ హరికేన్స్ తరుఫున ఆడుతున్న లీజెల్.. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో 75 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత చూపించింది. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రేస్ హారిస్ రికార్డును లీజెల్ బద్దలు కొట్టింది. గతేడాది డబ్ల్యూబీబీఎల్‌లో హారిస్ 59 బంతుల్లో 12 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయంగా 136 పరుగులు చేసింది.
Read Also: Health: చలికాలంలో ఆరోగ్యానికి ఇవి పవర్ బూస్టర్.. తిన్నారంటే..?
రెండు ప్రపంచ రికార్డులు సొంతం:
32 ఏళ్ల లీజెల్ రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో ఓ దేశ మహిళా క్రీడాకారిణిగా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఆమె సొంతం. అంతేకాకుండా.. మహిళల టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రీడాకారిణిగా లిజెల్ నిలిచింది. ఈ విషయంలో హారిస్ (11 సిక్సర్లు)ను అధిగమించింది. మ్యాచ్ గురించి మాట్లాడితే.. లిజెల్ భారీ ఇన్నింగ్స్‌తో హోబర్ట్ హరికేన్స్ 203/3 భారీ స్కోరు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 131 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. హరికేన్స్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read Also: Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిజ్జర్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్..
WBBL చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు
150* – లీజెల్ లీ
136* – గ్రేస్ హారిస్
114* – స్మృతి మంధాన
114 – యాష్లే గార్డనర్
112* – అలిస్సా హీలీ
లిజెల్ తన చారిత్రాత్మక ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. “నాపై నమ్మకం ఉంచిన నా జట్టు సభ్యులందరికీ ధన్యవాదాలు.” తెలిపింది. కాగా.. లిజెల్ 2022 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రెండు టెస్టులు, 100 వన్డేలు, 82 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 42, వన్డేల్లో 3315, టీ20ల్లో 1896 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.