కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులు ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది. కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 14వ రోజు మార్మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులయ్యారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంతో సహా హాజరయ్యారు. అలాగే.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం తిలకించారు.
PM Modi: 3 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోడీ
కార్తీక శుక్రవారం వేళ ఈరోజు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. పద్నాలుగో రోజు వేడుకల్లో… బృందావనం ఆనందధామం సద్గురు రితేశ్వర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మ శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం, శ్రీకృష్ణతత్త్వంపై డా.ఎల్వీ గంగాధరశాస్త్రి గాన ప్రవచనం అలరించాయి. ఆ తర్వాత.. జగన్మాత వైభవం, భక్తులచే కనకదుర్గమ్మకు కోటిగాజుల అర్చన మధురాతి మధురంగా చేశారు. అలాగే.. ఉడిపి శ్రీకృష్ణ నవనీతపూజ, మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం చూసి భక్తులు తిలకించి తరించిపోయారు. ఆదిదంపతులు నందివాహనంపై భక్తులను అనుగ్రహించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 14వ రోజు కోటి దీపోత్సవం వైభవంగా ముగిసింది.