ICC Test Ranking: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో నెంబర్-1 బౌలర్ మనోడే..
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
- పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన స్టార్ బౌలర్
- మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచిన బుమ్రా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి.. మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు.. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి జైస్వాల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు. దీంతో.. అతను కూడా ర్యాంకింగ్‌లో దూసుకొచ్చాడు. కోహ్లీ 9 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ ర్యాంకింగ్‌లో పెర్త్ టెస్టులో అర్ధశతకం సాధించడంంతో13 స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. తొలి టెస్టు ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయాడు. గిల్ 17వ స్థానానికి పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అతను ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. రోహిత్ 26వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
Also Read
బౌలర్ల టెస్ట్ ర్యాంకింగ్ గురించి మాట్లాడితే.. బుమ్రా మరోసారి టెస్ట్ బౌలర్‌గా నెంబర్-1 నిలిచాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడ రెండో స్థానానికి దిగజారగా, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ మూడో స్థానానికి పడిపోయాడు. పెర్త్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడనప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం సంపాదించి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Read Also: Nimmala Ramanaidu : పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనుల పురోగతిపై సమీక్ష
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!