లండన్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది. “నేను అతని వద్దకు తిరిగి వెళ్ళను, అతను నన్ను చంపేస్తాడు” అని హర్షిత తన తల్లితో చెప్పింది. తన భర్త పంకజ్ లాంబా తనకు నరకం చూపిస్తున్నాడని హత్యకు ముందు హర్షిత తల్లితో చెప్పింది. హర్షిత బరేలా ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ నుంచి లండన్ వెళ్లింది. ఆగస్టు 2023లో పంకజ్ లాంబాతో వివాహం జరిగింది.
Read Also: CM Chandrababu: రాష్ట్ర విభజన కంటే.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఎక్కువ నష్టం: సీఎం చంద్రబాబు
హత్యకు ముందు హర్షిత గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు పంకజ్ లాంబాను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే అతను ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాడు. తమను ఆదుకునేందుకు బ్రిటిష్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని హర్షిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తమ సహాయం కోసం బ్రిటిష్ అధికారులు ఇంకా భారత్‌ను సంప్రదించలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. హర్షిత తండ్రి సత్బీర్ బరేలా మాట్లాడుతూ.. తన అల్లుడు గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు. పంకజ్ లాంబా హర్షితను చాలా దారుణంగా కొట్టాడని.. ఆమె గర్భధారణ సమయంలో ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పారు. పంకజ్ తన కూతురును బహిరంగంగా కొట్టేవాడని.. ఆమె చాలా ఏడ్చేదని తన కూతురు తనతో చాలాసార్లు చెప్పిందని సత్బీర్ చెప్పాడు.
Read Also: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు
ఈ కేసులో హర్షిత 2023 ఆగస్టులో గృహ హింసపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. పంకజ్ లాంబాను సెప్టెంబర్ 3న పోలీసులు అరెస్టు చేశారు. తరువాత అతను బెయిల్ పై బయటికొచ్చాడు. మరోవైపు.. హర్షితను తన కొడుకు చంపగలడని నమ్మలేకపోతున్నానని పంకజ్ లాంబా తల్లి సునీల్ దేవి మీడియాతో తెలిపారు. “నాకేమీ తెలియదు, కానీ అతను అలా చేసి ఉంటాడని నాకు ఖచ్చితంగా తెలియదు,” అని ఆమె చెప్పింది. హర్షిత బరేలా హత్య బ్రిటన్, భారతదేశంలో గృహ హింస కేసులపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ క్రమంలో.. బరేలా కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది.