ప్రముఖ బైక్ కంపెనీ కవాసకి ఇండియా.. తన నింజా లైనప్‌పై డిసెంబర్ 2024లో బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో మూడు నింజా బైక్‌లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద కవాసకి నింజా 500, కవాసకి నింజా 300, కవాసకి నింజా 650పై వేల రూపాయల తగ్గింపుతో అందజేస్తున్నారు. ఈ కవాసకి బైక్‌లపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
Read Also: Upasana: అదే నిజమైన సనాతన ధర్మం.. ఉపాసన పోస్ట్ వైరల్
కవాసకి నింజా 300:
ఇది భారత మార్కెట్లో కవాసకి నుండి చౌకైన స్పోర్ట్స్ బైక్. ఈ ఆఫర్ కింద నింజా 300 ఎక్స్-షోరూమ్ ధరపై రూ.30 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. భారత మార్కెట్లో ఈ కవాసకి బైక్ ధర రూ.3.43 లక్షలు ఉంది. నింజా 300పై ఈ తగ్గింపు ఈ నెలాఖరు వరకు లేదా స్టాక్‌లు ముగిసే వరకు ఉంటుంది. ఈ బైకు 296 సీసీ, ప్యారలాల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 38.88 bhp శక్తిని, 26.1Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో హాలోజన్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. దీనితో పాటు.. ఇది సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్, స్మార్ట్‌ఫోన్-కనెక్ట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కవాసకి నింజా 500:
కవాసకి నింజా 500పై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్‌పై రూ.15,000 తగ్గింపు ఇస్తోంది. భారతదేశంలో నింజా 500 ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.24 లక్షలు ఉంది. ఈ ఆఫర్ స్టాక్ ఉండే వరకు లేదా ఈ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ బైకు 451 సీసీని కలిగి ఉంటుంది. సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇందులో అమర్చిన ఇంజన్ 44.7 బిహెచ్‌పి పవర్, 42.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకుకు ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌లను ఇచ్చారు. ఈ బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD, డ్యూయల్-ఛానల్ ABS, LED లైట్లు వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.
కవాసకి నింజా 650:
కవాసకి నింజా 650పై కంపెనీ రూ.45,000 తగ్గింపును ఇస్తోంది. ఈ బైకుపై తగ్గింపు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2024 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు ఉండనుంది. కవాసకి నింజా 650 భారతదేశంలో రూ.16 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. ఈ బైకు 649 సీసీ, సమాంతర-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 67 bhp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో కూడా ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటాయి. అలాగే.. LED లైట్లు, TFT స్క్రీన్, ట్రాక్షన్ కంట్రోల్, ABS, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో తయారు చేశారు.