Rajesh Veeramalla
Author- NTV Telugu-
Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది. -
IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. -
Crime News: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్, 8 మంది అరెస్ట్
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు. -
Crime News: హషీమ్ బాబా గ్యాంగ్ షూటర్ సోనూ మట్కా ఎన్కౌంటర్..
మీరట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. -
Bihar: బీహార్‌లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
బీహార్‌లోని అర్వాల్లో ఓ నిర్మాణ సంస్థపై దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి మఖమిల్పూర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద పార్క్ చేసిన రోడ్డు నిర్మాణ సంస్థ వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. కొంతమంది పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని రోడ్డు రోలర్, రెండు జేసీబీలు, రెండు హైవేలు, రెండు ట్రాక్టర్లతో కూడిన ట్యాంకర్లను తగులబెట్టారు. -
Kadapa: 13 సార్లు యువతిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది అరెస్ట్..
వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు. -
Rajasthan: దొంగతనం తర్వాత నిద్రలోకి జారుకున్న దొంగ.. ఉదయం లేచే సరికి తలక్రిందులుగా..!
ఓ దొంగను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన రాజస్థాన్‌లోని బుండిలో చోటు చేసుకుంది. ఆ ఊర్లో ఉన్న పొలాల వద్ద నుంచి దొంగ కేబుల్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని దొరకబట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు. -
Sanjay Malhotra: ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ మల్హోత్రా ఎవరు..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంజయ్ మల్హోత్రా కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా భారత ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి కార్యదర్శిగా పని చేశారు. కాగా.. సంజయ్ మల్హోత్రాను దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదించారు. శక్తికాంత్ దాస్ లాగానే మల్హోత్రా కూడా IAS అధికారి. అతను 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. -
WTC 2025 Final: టీమిండియాకు బిగ్ షాక్.. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా జట్టు
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది. -
BCCI: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా నియామకం..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. జాయింట్ సెక్రటరీ దేవ్జిత్ సైకియాను బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా నియమించారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!