నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్‌నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ […]
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్లో సాగుతోంది. ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ […]
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం ఉందని లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా వేడి రగిలించాయి. నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చకు భూపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నాయట. సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీచేసే అవకాశం లేకపోలేదన్న భూపాల్‌రెడ్డి.. గులాబీ బాస్ నల్లగొండను ఎంపిక చేసుకుంటే చరిత్రలో నిలిచిపోయే […]
ఏపీ టీడీపీలో మహానాడు ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే ఒక్క సభతో కేడర్ మనసు మారిపోయిందన్న ప్రచారం మొదలైంది. శ్రేణుల్లో దూకుడు చూశాక.. సభా వేదికపై పొత్తుల మాటే వినిపించలేదు. ఇప్పుడు టీడీపీ కేడర్ సైతం కొత్తరాగం అందుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారిపోయింది. మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉంది టీడీపీ. జనసేనాని నేరుగా చెప్పకపోయినా.. టీడీపీకి సానుకూల సంకేతాలు ఇచ్చేలా ప్రకటనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ […]
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిలింస్ అధినేత్రి సునీత తాటి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇది తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడు. మంగళవారంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన […]