సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా ఆమడ దూరం వెళుతుంటారు. కొందరు మాత్రం ధైర్యం చేసి వాటి పట్టుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్‌పూర్ జిల్లాలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సహరన్‌పూర్‌లోని ముజఫరాబాద్ మండలంలోని బధేరి ఘోగు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడి ఓ ఇంటి గోడలు మరియు నేల నుంచి వరుసగా వింత శబ్దాలు వినిపించడంతో కంగారు పడ్డారు కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు. అనుమానం వచ్చి పరిశీలించగా చూడడంతో , గోడలోపల నుంచే పాములు ఒక్కొటిగా బయటకు రావడం మొదలైంది. మొదట ఒక పాము కనిపించగా, కొద్ది సేపటిలోనే మొత్తం ఏడుకు పైగా పాములు బయటపడ్డాయి.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది, స్నేక్ క్యాచర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం గంటకు పైగా కష్టపడి ఆ పాములన్నింటిని బంధించారు. వెంటనే వాటిని స్థానికంగా ఉండు అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు పాత రంధ్రాల్లో లేదా నేల కింద ఉన్న బోయిలో దాక్కున్నాయని, వాతావరణ మార్పుల కారణంగా అవి బయటకు వచ్చి ఉంటాయని స్నేక్ క్యాచర్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.