సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్ సీరియస్‌గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో […]
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. కోశాధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. వీళ్లంతా నిజామాబాద్ జిల్లా నాయకులే. మహేష్‌గౌడ్ పూర్తిస్థాయిలో పార్టీ పనిలో ఉంటే.. […]
పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి వర్గపోరు తీవ్రంగానే ఉంది. పార్టీ బలోపేతానికి ఇంఛార్జ్ పదవులు చేపడుతున్న నేతలు.. కేడర్‌ను పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మూడుసార్లు ఇంఛార్జులను మార్చారు. అయిన్పటికీ పరిస్థితి మొదటికొస్తుంది తప్పితే మార్పు లేదట. గత ఎన్నికల్లో ఓడిన పీవీఎల్ నరసింహరాజును ఆ మధ్య ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించారు. తాజాగా మళ్లీ ఆయనకే పగ్గాలు ఇచ్చారు. దీంతో […]
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం […]
నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని […]