ప్రేమ వివాహం రెండు వర్గాల మధ్య గొడవ రేకెత్తించింది. .రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడకలతో విసురుకుంటూ దాడి చేసుకుంటారు. దాడి చేసుకున్న అనంతరం రెండు వర్గాలు అన్నదమ్ములు లా కలిసిపోయి ఆ ప్రేమ వివాహాన్ని జరిపిస్తారు .ఇలాంటి విచిత్ర వివాహం చూడాలంటే మనం కర్నూలు జిల్లా వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో ఉగాది పండుగ మరుసటి రోజున పిడకల సమరం ఆడడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వచ్చింది. పూర్వం […]
ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేకెత్తించింది. కంభం లోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన నాటు బాంబుని ఓ కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలింది. బాంబు పేలుడు ధాటికి కుక్క తల మొత్తం చిధ్రమైపోయింది. భారీ శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కంభం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంటి […]
కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. భారత్ లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్లపై ఏర్పాటు […]
దుర్గగుడిలో వెండి రథంలో మిస్సయిన నాలుగు సింహాలు అమర్చినందుకు గాను సాయంత్రం రథోత్సవానికి లైన్ క్లియర్ అయింది. వెండి రథంలో నాలుగు సింహాలు కొత్తవి అమర్చారు దుర్గగుడి అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. నాలుగో సింహం చోరీకి యత్నించి విఫలం అయ్యారు దుండగులు. ప్రస్తుతం నాలుగు సింహాలు వెండి రథంలో యధాస్థానంలో తిరిగి దుర్గగుడి అధికారులు నిర్మించారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో హైదరాబాద్ […]
అంజనాద్రే హనుంతుడి జన్మస్థలం అని టిటిడి నియమించిన కమిటీ నివేదిక సమర్పించిందన్నారు ఇఓ జవహర్ రెడ్డి. శ్రీరామ నవమి పర్వదినం రోజున వెల్లడిస్తే బాగుంటుంది అని కొంత మంది సలహాలు ఇవ్వడంతో వారం రోజుల పాటు ఆధారాల సమర్పణ భక్తులు ముందు వుంచే ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నామన్నారు ఇఓ. కమిటీ సమర్పించిన ఆధారాలను భక్తులు ముందు ఉంచుతామని… భక్తులు సూచన మేరకు కమిటీని ఏర్పాటు చేసి ఆధారాలు సమర్పించమని ఆదేశించామని ఆయన అన్నారు. హంపిలోని కిష్కింద కూడా […]
ఎప్పుడూ గ్రీన్ జోన్ లో ఉండే విజయనగరం జిల్లాలో కరోనా టెన్షన్ మొదలైంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీలకు చెరువవుతున్నాయి ..ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ఇటు అధికారులు , అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా .. కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేయడం తో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి గత నెల వరకు ఒకటి రెండు కేసులతో గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఇప్పుడు […]
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్‌షోలో బాబు వాహనంపైకి అగంతకులు రాళ్లు రువ్వారు. దాంతో, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. రాళ్ల దాడిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు క్రిష్టాపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపధ్యంలో సీఎం జగన్ డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. జడ్ ప్లస్ […]
విన్నావా ఆరుద్రా తమాషా సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా అన్నాడు శ్రీశ్రీ ఒక చోట. నిజంగానే సంప్రదాయాలు విశ్వాసాలు తరతరాలు కొనసాగుతుంటాయి. అయితే వాటి రూపం మారిపోతుంటుంది. అంతేగాక భిన్నమైన సంప్రదాయాలు సంసృతులు విశ్వాసంగా సువిశాల భారత దేశంలో ఈ క్రమంలో మరింత సాగుతుంటుంది. ఒక్కొక్క కుటుంబంలోనూ లేదా సమాజంలో వచ్చే ఈ మార్పు మొత్తం స్వరూపం అందరూ చేసుకునే పండుగలు పబ్బాలు సమయంలో మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే` తెలుగువారి తొలి పండుగ, […]
తుపాకీ కాల్పులకు ఓ మహిళ ప్రాణాలు వదిలింది. కట్టుకున్న భర్త క్షణికావేశంలో తన దగ్గర ఉన్నఉన్నతాధికారి తుపాకితో భార్యపై ఈ కాల్పులు జరపటం సంచలనంగా మారింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు కావటంతో ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి కేసు విచారణ చేపట్టారు. తొలుత గన్ మిస్ ఫైర్ అవటంతో తన భార్య చనిపోయిందని కట్టు కథలు చెప్పిన హోంగార్డు వినయ్ ఆ తర్వాత పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది..విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు…గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని […]