దుర్గగుడిలో వెండి రథంలో మిస్సయిన నాలుగు సింహాలు అమర్చినందుకు గాను సాయంత్రం రథోత్సవానికి లైన్ క్లియర్ అయింది. వెండి రథంలో నాలుగు సింహాలు కొత్తవి అమర్చారు దుర్గగుడి అధికారులు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. నాలుగో సింహం చోరీకి యత్నించి విఫలం అయ్యారు దుండగులు. ప్రస్తుతం నాలుగు సింహాలు వెండి రథంలో యధాస్థానంలో తిరిగి దుర్గగుడి అధికారులు నిర్మించారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో హైదరాబాద్ లో నాలుగు సింహాలు ప్రత్యేకంగా తయారు చేయించిన అధికారులు వాటిని రధానికి అమర్చారు. ఒక్కో సింహం 3 కేజీల బరువు..నాలుగు సింహాలు కలిపి 12 కేజీల బరువు ఉంటుందని అంచనా. ఇక ఉగాది పర్వదినం రోజున పాతబస్తీలోని పురవీధులలో వెండి రధోత్సవాన్ని అధికారులు నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనల నడుమ ఆంక్షలతో సాయంత్రం రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.