ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేకెత్తించింది. కంభం లోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన నాటు బాంబుని ఓ కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలింది. బాంబు పేలుడు ధాటికి కుక్క తల మొత్తం చిధ్రమైపోయింది. భారీ శబ్దంతో బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కంభం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఉంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంటి బాత్ రూమ్ లో దాచి ఉంచిన నాటు బాంబుని ఓ వీధి కుక్క నోటితో కొరికింది. ఒక్కసారిగా బాంబు పేలడంతో తల చిద్రమై పోయింది. భారీ శబ్దంతో నాటు బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబు పేలుడు పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నాటు బాంబుని అడవి పందుల కోసం వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కంభం లో నాటు బాంబు పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది.