కోవిడ్ మీద సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
గ్రీవెన్స్ కోసం 1902 నెంబరు, కోవిడ్ సేవల కోసం104 నెంబరు కేటాయించాలన్నారు జగన్. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రెండు నెంబర్లు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కోవిడ్ పరీక్ష మొదలు వైద్యం, మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వరకు.. ఏమాత్రం రాజీ పడొద్దు అన్నారు సీఎం. ప్రైవేట్ హాస్పిటళ్లలో అధిక ఫీజుల పై సీఎం జగన్ దృష్టి సారించారు. హాస్పిటళ్లలో చికిత్స ఫీజులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్ధమయ్యేలా ప్రదర్శించాలన్నారు.
Also Read
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు తెలిసేలా అన్ని వివరాలు ఉండాలని, అవసరమైన ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు రేట్లు కూడా స్పష్టంగా ప్రదర్శించాలి అని ఆదేశించారు. అంతేకాదు ఎక్కడైనా అధిక ఫీజులు, ఛార్జీలు వసూలు చేస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్ చేయాలని అన్నారు. వీరికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్‌తో కూడిన కోవిడ్ కిట్ తప్పనిసరిగా అందించాలని పేర్కొన్నారు జగన్. రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా కోవిడ్ అంశంపై సమావేశం కానున్నారు సీఎం జగన్
తాజావార్తలు
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!