బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఈ ఉదయం నుండి ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్ష చేశారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ లో ఎందుకు చలనం కలగడం లేదని ఆమె ప్రశ్నించారు. అయితే నిజానికి తాను ముందుగా ప్రకటించినట్టుగా 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. తన 72 గంటల దీక్ష పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు మద్దతుగా జిల్లాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు. మూడు రోజులపాటు దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరింది. అయితే ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఆమె పోలీసుల బలవంతం మీద దీక్షా స్థలం వద్ద నుండి కదిలారు. అయితే ఆమె పాదయాత్రగా అక్కడి నుండి బయలుదేరడంతో కొంత దూరం మేర ఆమెను వారించడానికి చూసిన పోలీసులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అరెస్ట్ చేశారు,
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబు భారీ లక్ష్యం
తాజావార్తలు
-
Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
-
Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
-
Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
-
Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్‌పై అసంతృప్తే కారణమా?
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!