విశాఖలో ఈరోజు ఉదయం ఆరు హత్యలు జరిగాయి. పాత కక్షలే దీనికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అందరూ నిద్రపోయే వరకు ఇంట్లోనే వేచి ఉన్నాడు. కుటుంబంలో అందరూ నిద్ర పోయిన తరువాత పదునైన ఆయుధంతో కుటుంబసభ్యుల మీద దాడి చేశారు. విచక్షణారహితంగా రహితంగా నరికి చంపాడు. చనిపోయిన వారిలో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. హత్య జరిగిన తరువాత నిందితుడు అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు.
అప్పలరాజు కుమార్తె ఇప్పుడు హతుల కుటుంబంలోని విజయ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే 2007లో విజయవాడకు చెందిన ఉషారాణితో విజయ్ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు, పెద్ద కుమారుడు అకీరా నందన్ వయసు ఏడేళ్లు కాగా చిన్నబ్బాయి ఉదయ నందన్ వయసు 2 ఏళ్ళు, మరో చిన్నారి లిస్విత వయసు 6 నెలలు. 2018లో బత్తిన అప్పలరాజు కుమార్తె తో ప్రేమ వ్యవహారం నడుపుతూ చనువుగా ఉంటున్నాడని అప్పట్లో పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా కేసుల దాకా వెళ్ళింది. అప్పలరాజు కుమార్తెకు ఇంకా వివాహం కాలేదు, అప్పలరాజు కుమార్తెతో విజయ్ ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు.
2018 నుంచి విజయ్ పై కక్ష పెంచుకున్న హంతకుడు అప్పలరాజు, ఇదే వ్యవహారంపై విజయ్ కుటుంబాన్ని మొత్తం హతమార్చినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తన కుటుంబంతో విజయవాడలో ఉంటున్నాడు, అయితే నిన్న బంధువుల పెళ్లి కార్డులు పంచేందుకు జుత్తాడ గ్రామానికి విజయ్ కుటుంబం చేరుకుంది. అయితే విజయ్ మాత్రం రాలేదు. అతను వచ్చి ఉంటాడని ఇంట్లోకి వెళ్లి నక్కిన అప్పలరాజు కన్పించిన అందరినీ పొట్టన పెట్టుకున్నాడు. మృతుల్లో… విజయ్ తండ్రి, భార్య, అత్త, చిన్నత్త, చిన్న కుమారుడు, కుమార్తె ఉన్నారు.