Shubhalekha Sudhakar: పాత్రల్లోకి ‘శుభలేఖ’ సుధాకర్ పరకాయ ప్రవేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubhalekha Sudhakar:ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు ‘శుభలేఖ’ సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్ తోనూ ఇద్దరూ అలరించడం విశేషం!
సుధాకర్ అసలు పేరు సూరావఝ్ఝల సుధాకర్. 1960 నవంబర్ 19న సుధాకర్ జన్మించారు. చదువు పూర్తి కాగానే మనసు సినిమాల్లోకి వెళ్తానని మారాం చేసింది. మదరాసులో పాత్రల కోసం ప్రయత్నాలలో ఉండగా, కె.విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘శుభలేఖ’లో కీలక పాత్రకు ఎంపికయ్యారు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో, ఆ తరువాత ఆకట్టుకున్న పాత్ర సుధాకర్ దే! ‘శుభలేఖ’ సమయంలోనే తమిళంలో శివాజీ గణేశన్ చిత్రం ‘తునై’లోనూ నటించారు సుధాకర్.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
‘శుభలేఖ’ విడుదలై మాతృభాష తెలుగులో మంచి పేరు దక్కింది. అప్పటికే ఓ సుధాకర్ చిత్రసీమలో ఉండగా, ఈ సుధాకర్ తన సినిమా ‘శుభలేఖ’ను ఇంటిపేరుగా చేసుకోవలసి వచ్చింది. ఆ పేరే ఆయనకు శుభాలు చేకూర్చింది. సోలో హీరోగా ఎప్పుడూ హిట్టు పట్టలేదు కానీ, హీరోకు సమానమైన పాత్రల్లో నటించేసి విజయాలు చూశారు సుధాకర్. “సితార, రెండు జెళ్ళ సీత, మంత్రి గారి వియ్యంకుడు, రావు గోపాలరావు, జననీ జన్మభూమి, స్వాతి, స్రవంతి, ప్రేమించు పెళ్ళాడు, అన్వేషణ, లేడీస్ టైలర్, సీతారామకళ్యాణం, అహ నా పెళ్ళంట, కలెక్టర్ గారి అబ్బాయి, శ్రీనివాస కళ్యాణం, ముద్దుల మావయ్య, శివ, ఆదిత్య 369, పెళ్ళి పుస్తకం, చిత్రం భళారే విచిత్రం, భైరవద్వీపం, గౌతమీపుత్ర శాతకర్ణి, భీష్మ, అరవింద సమేత” వంటి చిత్రాలలో శుభలేఖ సుధాకర్ తనదైన బాణీ పలికిస్తూ నటించారు. కొన్నిట సెకండ్ హీరోగా, కొన్నిటిలో విలన్ గా, మరి కొన్ని సినిమాల్లో కేరెక్టర్ యాక్టర్ గా ఇలా వైవిధ్యం పలికిస్తూ సాగారు సుధాకర్.
ఇప్పుడయితే ఎంతోమంది యువదర్శకులు శుభలేఖ సుధాకర్ ను తమ చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ కు ఎంపిక చేసుకుంటున్నారు. అవి లేకపోయినా, పరభాషా నటులకు డబ్బింగ్ చెప్పడానికైనా శుభలేఖ సుధాకర్ గళాన్ని వాడేస్తున్నారు. శుభలేఖ సుధాకర్ కూడా నటన మాత్రమే చేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. శుభలేఖ సుధాకర్, శైలజ దంపతులకు ఓ కుమారుడు. పేరు శ్రీకర్. ఒకప్పుడు సినిమాలలో బిజీగా సాగిన సుధాకర్, తరువాత టీవీ సీరియల్స్ లోనూ మురిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ వాలిపోతున్నారు. ప్రతీచోటా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ‘శుభలేఖ’ సుధాకర్ రాబోయే చిత్రాల్లోనూ మరింతగా అలరించాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!