Satyanarayana in Hindi: సత్యనారాయణ హిందీ వారినీ ఆకట్టుకున్నారు. అయితే ఆరంభంలో తెలుగు చిత్రాలను హిందీలో డబ్ చేయగా, వాటి ద్వారా ఉత్తరాది వారికి పరిచయం అయ్యారు సత్యనారాయణ. యన్టీఆర్, అంజలీదేవి నటించిన మహత్తర పౌరాణిక చిత్రం `లవకుశ` హిందీ,బెంగాల్ భాషల్లోనూ అనువాదమై అలరించింది. ఆ చిత్రంలో భరతునిగా సత్యనారాయణ నటించారు. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన `సీతాకళ్యాణం`లో సత్యనారాయణ రావణునిగా అభినయించారు.
Read also: Bhadradri Adhyayana Utsavam: భద్రాద్రికి ముక్కోటి శోభ.. నేటినుంచి అధ్యయనోత్సవాలు
ఈ చిత్రం హిందీలో `సీతా స్వయంవర్`గా అనువాదమైంది. అలాగే తెలుగులో సత్యనారాయణ రావణాసురునిగా నటించిన మరో చిత్రం `సీతారామ వనవాసము` హిందీలో `సీతారామ్ వనవాస్`గా రూపొందింది. అయితే ప్రముఖ హిందీ దర్శకుడు సుభాష్ ఘై సత్యనారాయణను ఏరి కోరి తన మల్టీస్టారర్ `కర్మ`లో నటింప చేశారు. ఈ చిత్రంలో సత్యనారాయణ విలక్షణమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
kaikala satyanarayana: కైకాల సత్యనారాయణ ప్రస్థానం..