తెలుగు చిత్రాలకు ఓ గ్లామర్ ను, గ్రామర్ ను తీసుకు వచ్చిన వారిలో దిగ్దర్శకులు కె.వి.రెడ్డి స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలో తొలుత ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన కె.వి.రెడ్డి తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన చిత్రం 'భక్త పోతన'.
SP Charan Birthday special: గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వారసుడు యస్.పి.చరణ్ సైతం నాన్న బాటలోనే పయనిస్తున్నారు. గాయకునిగా, నటునిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా, సంగీతకళాకారుల పోటీలో న్యాయనిర్ణేతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు బాలు. ఆయన చూపిన దారిలోనే చరణ్ సైతం సాగుతున్నారు. ఇప్పటికే నటునిగా, గాయకునిగా, నిర్మాతగా అలరించిన చరణ్, తన తండ్రిలాగే పాటల పోటీలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. మునుముందు మరిన్ని ప్రక్రియల్లోనూ తన బాణీ పలికించి తండ్రికి తగ్గ తనయుడు […]
ఎ.ఆర్.రహమాన్ స్వరవిన్యాసాలకు అభిమానులు కానివారు ఎవరుంటారు? మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లోనూ కొన్ని పాటలతో ఆకట్టుకున్నారు రహమాన్. ఆయన మాయాజాలం ఇంకా పనిచేస్తూనే ఉందని చెప్పవచ్చు. ఆయన తెలుగువారు కాకపోయినా, ఆయనంటే మన తెలుగువారికి ఎంతో అభిమానం. అలాగే రహమాన్ తల్లి కస్తూరి జన్మస్థలం మన తెలుగునేలలోని హైదరాబాద్.
Deepika Padukone Birthday Special: జనవరి 25న జనం ఏం చేస్తారో చూడాలి? ఇంతకూ ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? అంటే ఆ రోజున షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం విడుదల కానుంది. అందులో ప్రత్యేకత ఏముందబ్బా అంటారా? అవును, షారుఖ్ సినిమా వస్తోందంటే పరుగులు తీస్తూ థియేటర్లకు వెళ్ళే జనాల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిన మాట వాస్తవం! కానీ, అదే సినిమాలో నాయిక దీపికా పదుకొణే “హమే తో లూట్ లియా మిల్కే ఇష్క్ […]
45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలున్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘చరణదాసి’. అందులో ఓ డ్రీమ్ సాంగ్ లో […]
ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, ఏవీయస్ అనగానే చప్పున జనం 'తుత్తి ఏవీయస్' అనేస్తారు. బాపు తెరకెక్కించిన 'మిస్టర్ పెళ్ళాం'లో 'తుత్తి' అంటూ ఏవీయస్ పంచిన వినోదం ఈ నాటికీ ఆ సినిమాచూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది.
తెలుగు చలనచిత్ర సీమలో 'భరణీ పిక్చర్స్' సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహానటి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ ఈ సంస్థను నెలకొల్పారు. బహుముఖ ప్రతిభాపాటవాలకే కాకుండా, సాహసానికీ మారుపేరుగా నిలిచారు భానుమతి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ 'ఖుషి' చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం 'ఖుషి' ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి 'సుస్వాగతం' పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు.
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం నాజూగ్గా, పొడుగు కాళ్ళతో లేలేత అందాలతో చూపరుల కన్నులు మిరమిట్లు గొలిపేలా సోనాలీ బింద్రే సందడి చేశారు. అప్పట్లో అనేక కమర్షియల్స్ లో సోనాలీ సోయగాలు కుర్రకారుకు బంధాలు వేశాయి. వాటిని మరింత గట్టిగా బిగించేస్తూ సినిమాల్లోనూ మురిపించి, జనాన్ని మైమరిపించేలా చేశారు సోనాలీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో న్యూ ఇయర్ గిఫ్ట్ లభించనుంది. ఇప్పటికే 2023 కానుకగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖుషి' డిసెంబర్ చివరిరోజున జనాన్ని పలకరించింది. 'ఖుషి' చిత్రాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.