నటప్రపూర్ణ డాక్టర్ యమ్.మోహన్ బాబు తనదైన అభినయంతో వందలాది చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనావారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, కూతురు మంచు లక్ష్మి సైతం సాగుతున్నారు. ఇప్పటికే తనయులతో కలసి నటించి అలరించిన మోహన్ బాబు, తొలిసారి కూతురు లక్ష్మితో కలసి ‘అగ్నినక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుర్వాసునిగానూ తనదైన అభినయంతో అలరించనున్నారు మోహన్ బాబు. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ […]
నటశేఖర కృష్ణ, అందాలరాశి శ్రీదేవి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. శ్రీదేవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుంది. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఆరంభమైన కృష్ణ, శ్రీదేవి జోడీ తరువాత దాదాపు పాతిక చిత్రాలలో కనువిందు చేసింది. వారిద్దరూ నటించిన చిత్రాలలో ‘కిరాయి కోటిగాడు’ కూడా భలేగా సందడి చేసింది. ఈ చిత్రానికి ముందు కృష్ణ-శ్రీదేవి జంటగా “బుర్రిపాలెం బుల్లోడు, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, అదృష్టవంతుడు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ, […]
Bangaru Babu: మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థకూ ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించడానికీ కారకులు ఏయన్నారే!
Akbar Saleem Anarkali: ఏ సినిమాకైనా జనమే అసలైన న్యాయనిర్ణేతలు! వారి మదిని గెలిచిన చిత్రాలను మెచ్చి మరీ మరీ చూస్తారు. నచ్చకపోతే ఎంతమంచి పాటలున్నా, ఎందరు మేటి నటులు నటించినా ఆదరించరు. చిత్రసీమలో అలాంటి సినిమాలూ ఎన్నో ఉన్నాయి.
Alia Bhatt: ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ సినీ అభిమానులు 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు..." పాట గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలకు ఆస్కార్ అసాధ్యం అనుకున్నది "నాటు నాటు..." పాట సుసాధ్యం చేసింది.
సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్'ను ఏర్పాటు చేసింది.
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు 'ప్రిడిక్షన్స్' ప్రకటించాయి. 'లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్" వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి.
రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్'లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన "నాటు నాటు..." అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు.
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది.