Brad Pitt: అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు బ్రాడ్ పిట్. ఏంజెలినా జోలీతో విడిపోయిన దగ్గర నుంచీ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు.
అంతకు ముందు ఎన్ని చిత్రాల్లో నటించినా జెన్నీఫర్ ఆనిస్టన్ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తోనే ‘హౌస్ హోల్డ్ నేమ్’గా మారిపోయింది. ‘ఫ్రెండ్స్’ 10 సీజన్లలో 236 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఒక్కో సీజన్ అయిపోయిగానే, కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని జనం ఎదురుచూశారు. అంతలా ‘ఫ్రెండ్స్’ అలరించడానికి జెన్నీఫర్ ఆనిస్టన్ కారణమని చెప్పక తప్పదు. అందులో ఆమె పోషించిన రేచల్ గ్రీన్ పాత్ర ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘ఫ్రెండ్స్’తోనే ఆనిస్టన్ కు లక్షలాది మంది అభిమానులు పోగయ్యారు. చిత్రమేమిటంటే, ఒకప్పుడు […]
‘అజరామరం’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన కొన్ని కళాఖండాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ‘అజరామర చిత్రం’ అంటే 1963లో రూపొందిన ‘లవకుశ’ తరువాతే ఏదైనా అనేవారు ఎందరో ఉన్నారు. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా తెరకెక్కిన ‘లవకుశ’ 1963 మార్చి 29న విడుదలయింది. నభూతో నభవిష్యత్ అనదగ్గ విజయం సాధించింది. అరవై ఏళ్ళవుతూ ఉన్నా, ఆ సినిమాను అధిగమించిన మరో పౌరాణికం మనకు కానరాదు. అలాగే ఆ చిత్రం దక్షిణాదిన కోటి రూపాయలు వసూలు చేసిన […]
Desoddharakulu: తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'. ఆ చిత్రంలో శ్రీరామచంద్రుని పాత్రలో అలరించారు నటరత్న యన్.టి.రామారావు. మొట్టమొదటి తెలుగు వర్ణచిత్రంలో కథానాయకునిగా నటించిన యన్టీఆర్ దాదాపు దశాబ్దం వరకు సాంఘికాలలో రంగుల చిత్రం తీయలేదు.
అదృష్టవంతులను అవకాశాలు అన్వేషిస్తూ వస్తాయంటారు.’ఐకాన్ స్టార్’గా నేడు జనం మదిలో నిలచిన అల్లు అర్జున్ కు తొలి చిత్రంలోనే నవరసాలూ పలికించే అవకాశం లభించింది. బన్నీగా సన్నిహితులు అభిమానంగా పిలుచుకొనే అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు పసితనంలోనే తన తండ్రి అరవింద్ నిర్మించిన ‘విజేత’లో బాలనటునిగా కనిపించినా, తరువాత కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’లో తెరపై తళుక్కుమన్నా, ఆపై మేనమామ చిరంజీవి ‘డాడీ’లో డాన్స్ తో భలేగా మురిపించినా, అవేవీ బన్నీకి […]
చిత్రసీమలో అడుగుపెట్టగానే ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గానూ జేజేలు అందుకుంటున్నారు చరణ్. నటనిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్న రామ్ చరణ్, ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. మరో నటవారసుడు జూనియర్ యన్టీఆర్ తో కలసి ఈ మధ్యకాలంలో రూపొందిన అసలు సిసలు మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’లో నటించారు చెర్రీ. ఇందులో తారక్ తో కలసి చెర్రీ చిందేసిన తీరు […]
డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మేన్ గా సాగుతున్న రోజులవి. ఆయన నటించిన ‘అన్న’ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ‘మా ఆయన బంగారం’ ఊరటనిచ్చింది.అయితే ఆ పై ఆయనకు మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘శివయ్య’ అనే చెప్పాలి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.సురేశ్ వర్మ దర్శకత్వంలో డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1998 మార్చి 27న ‘శివయ్య’ జనం ముందు నిలచింది. ‘శివయ్య’ కథాకమామిషు ఏమిటంటే- జ్యోతి, పూర్ణ అనే అన్నదమ్ములు […]
విలక్షణమైన అభినయానికి సలక్షణమైన రూపం ప్రకాశ్ రాజ్. కేవలం నటునిగానే కాదు, దర్శకనిర్మాతగానూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశ్. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ చిత్రాలలోనూ నటిస్తూ ఆల్ ఇండియాలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆయన ముక్కుసూటితనం సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వివాదాలకూ దారితీస్తూ సాగుతుంది. ఒకప్పుడు షూటింగ్స్ కు సరైన సమయానికి రాడని, క్రమశిక్షణ చర్యల కింద ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ కూడా చేశారు.కానీ, ప్రకాశ్ రాజ్ మాత్రమే పోషించదగ్గ పాత్రలు […]