విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగింది అంటూ జనం కోడై కూస్తున్నారు. కానీ, మనోజ్ విడుదల చేసిన వీడియోలోనూ వారిద్దరూ ఎక్కడా గొడవపడినట్టు లేదు. కేవలం వాయిస్ ఓవర్ లో వినిపించిన మంచు మనోజ్ వాయిస్ లో “ఇది సిట్యువేషన్… ఇది ఇళ్ళల్లోకి వచ్చి కొడుతూంటాడండి…మావాళ్ళని బందువులని…” అని వినిపించడం ఓ కారణం కాగా, “వాడేదో అన్నాడు కదా… ఒరేయ్ గిరేయ్…అని…”అంటూ మంచు విష్ణు అనడం […]
Satyam Shivam Sundaram: 'షో మేన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన రాజ్ కపూర్ దర్శకత్వంలో 'బాబీ' తరువాత ఐదేళ్ళకు తెరకెక్కిన చిత్రం 'సత్యం శివం సుందరం'. 'బాబీ'లో తనయుడు రిషి కపూర్ ను హీరోగా పరిచయం చేసిన రాజ్ కపూర్, తరువాత తన తమ్ముడు శశికపూర్ హీరోగా 'సత్యం శివం సుందరం' చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు.
తెరపై ‘సూపర్’ అనిపించుకోలేదు కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ ‘సూపర్’ అనిపించుకుంటూ ఉంటారు సుమ కనకాల. యాంకర్స్ లో సుమ ‘సూపర్ స్టార్’ అనే చెప్పాలి. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండీ వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె. సుమ నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి. తేనెలూరే తెలుగు ఆమె గళంలో గలగల గోదారిలా ప్రవహిస్తుంది. చిత్రమేమిటంటే- సుమ మాతృభాష తెలుగు కాదు. అయినా తెలుగు […]
kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత 'గురువుగారూ...' అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి.
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ 'దైవబలం'తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు.
సుత్తి లేకుండా సూటిగా చెప్పడమే తనకు తెలుసునన అంటున్నారు 85 ఏళ్ళ జేన్ ఫోండా. ఆమె పేరు వినగానే నాజూకు షోకులు సొంతం చేసుకోవాలనుకొనే భామలకు జేన్ ఫోండా పాఠాలు గుర్తుకు వస్తాయి. ఏ వయసులోనైనా ఫిగర్ ను మెయింటెయిన్ చేయడం ఎలా అంటూ జేన్ ఫోండా కొన్ని దశాబ్దాల క్రితమే ఎక్సర్ సైజ్ వీడియోస్ రూపొందించారు. ఈ నాటికీ జేన్ ఫోండా వీడియోస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. జేన్ ఫోండా ఈ వయసులోనూ […]
తెలుగు చిత్రసీమలో అతిరథ మహారథులు అనదగ్గ నటీనటులు నటించిన అపురూప చిత్రాలు ఈ నాటికీ ప్రేక్షకులను పరవశింపచేస్తూనే ఉన్నాయి. అలాంటి పౌరాణిక చిత్రం ‘భూకైలాస్’. ఈ సినిమా ప్రతి మహాశివరాత్రి నాడు ఏదో ఒక చోట ప్రదర్శితమవుతూ ఉంటుంది. కనీసం బుల్లితెరపై అయినా ‘భూకైలాస్’ దర్శనమివ్వక మానదు. కర్ణాటకలో సుప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణం వెలసిన విధంబు ఎట్టిదో తెలుపుతూ ఈ చిత్రం రూపొందింది. ఇందులో భక్తునిగా రావణుడి దీక్ష, పట్టుదల మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రావణబ్రహ్మగా […]
స్ఫూర్తితోనే కీర్తి లభిస్తుందని ప్రతీతి. ఎవరైనా తమ కళలతో రాణించాలంటే అంతకు ముందు ఉన్నవారి కళల నుండి స్ఫూర్తి గ్రహించాల్సిందే అని పూర్వికులే సెలవిచ్చారు. దానిని ఆధారం చేసుకొనే మన కళాకారులు, రచయితలు సాగుతున్నారు.
చూడగానే బాగా పరిచయం ఉన్న మనిషి అనిపిస్తాడు. అతనిలోని ప్రతిభ సైతం అదే తీరున ఆకట్టుకుంటూ ఉంటుంది. కేవలం నటనతోనే కాకుండా, దర్శకునిగా, రచయితగా తనదైన బాణీ పలికిస్తున్నారు శ్రీనివాస్ అవసరాల. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ తాజా చిత్రం ఇటీవలే విడుదలై అలరిస్తోంది. అందులో నటునిగానూ శ్రీనివాస్ ఆకట్టుకున్నారు. మునుముందు కూడా నటన, దర్శకత్వంతో అలరించే ప్రయత్నాల్లోనే శ్రీనివాస్ అవసరాల సాగుతున్నారు. శ్రీనివాస్ అవసరాల 1984 మార్చి 19న కాకినాడలో […]