Sushanth: ‘చి.ల.సౌ.’ కోసం సుశాంత్ ఎదురుచూపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushanth Birthday Special: పట్టువదలని విక్రమార్కులకు పరమానందం కలిగించే విజయం లభిస్తుందని ప్రతీతి. యంగ్ హీరో సుశాంత్ అదే తీరున సాగుతున్నారు. తల్లి వైపు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తాత, తండ్రివైపు తాత ప్రముఖ నిర్మాత ఏ.వి.సుబ్బారావు (ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత), మేనమామ నాగార్జున టాప్ స్టార్ – ఇలా ఎటు చూసినా, తొలి నుంచీ సినిమా రంగంతో అనుబంధం ఉన్న సుశాంత్ చిత్రసీమలో రాణించడానికి పట్టువదలని విక్రమార్కునిలాగే శ్రమిస్తున్నారు. మధ్యలో ‘చి.ల.సౌ.’ వంటి విజయం మురిపించింది. మళ్ళీ ఆ తరహా సినిమా కోసం చూస్తున్నారాయన. అలాగని హీరో వేషాలే వేస్తానని భీష్మించుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో ‘అల…వైకుంఠపురములో’ గ్రాండ్ సక్సెస్ సుశాంత్ కు పరమానందం పంచింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ, మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు సుశాంత్.
సుశాంత్ 1986 మార్చి 18న హైదరాబాద్ లో జన్మించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకటసుబ్బారావు తనయుడు అనుమోలు సత్యభూషణ రావు సుశాంత్ తండ్రి. ఏయన్నార్ రెండో కూతురు నాగసుశీల సుశాంత్ తల్లి. తన తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున, పెద్దమ్మ కొడుకు సుమంత్ నటనలో రాణించడం చూశాక సుశాంత్ మనసు సైతం సినిమా రంగంవైపు పరుగు తీసింది. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేసిన సుశాంత్ కొంతకాలం ‘యునైటెడ్ టెక్నాలజీస్’లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు. తరువాత ముంబైలోని ‘క్రియేటింగ్ కేరెక్టర్స్ ట్రైనింగ్ స్కూల్’లో నటశిక్షణ తీసుకున్నారు. ‘కాళిదాసు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు సుశాంత్. ‘మహాకవి కాళిదాసు’గా నటించి మెప్పించిన అక్కినేని మనవడు ‘కాళిదాసు’గా రావడం అభిమానులకు ఆనందం కలిగించింది. తొలి చిత్రంతోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు సుశాంత్. ఈ సినిమా తరువాత “కరెంట్, అడ్డా” చిత్రాల్లోనూ హీరోగా నటించిన సుశాంత్ ‘దొంగాట’లో “బ్రేకప్ అంటూ…” అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
‘ఆటాడుకుందాం…రా’లో హీరోగా నటించిన సుశాంత్ కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆనందం పంచలేదు. లో బడ్జెట్ లో తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సుశాంత్ కు మంచి విజయాన్ని అందించింది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘చి.ల.సౌ.’ నటునిగానూ సుశాంత్ కు మంచి మార్కులు పోగేసింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.అలాగని హీరో వేషాలే వేయకుండా ఇతర హీరోల చిత్రాల్లోనూ నటిస్తున్నారు. సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ ‘మా నీళ్ళ ట్యాంక్’ అలరించింది. ఏది ఏమైనా సోలోహీరోగా సుశాంత్ మరోమారు ‘చి.ల.సౌ.’ వంటి డీసెంట్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సుశాంత్ కు ‘చి.ల.సౌ.’ రావలసి ఉంది. ఈ పుట్టినరోజు తరువాతయినా సుశాంత్ కోరుకున్న విజయాలు ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!