Alia Bhatt: అలియా భట్ అందం హిందోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt: ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ సినీ అభిమానులు ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాట గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలకు ఆస్కార్ అసాధ్యం అనుకున్నది “నాటు నాటు…” పాట సుసాధ్యం చేసింది. దాంతో ఆ పాటను స్వరపరచిన కీరవాణి, రాసిన చంద్రబోస్ విజేతలుగా ఆస్కార్ ను అందుకున్నారు. కానీ, వారికన్నా మిన్నగా ఆ చిత్రానికి పనిచేసిన వారందరూ ఆనందిస్తున్నారు. అంతెందుకు, ఆ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న దీపికా పదుకొణే అవార్డు ప్రకటించగానే ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక ఆ చిత్రంలో నటించిన వారి సంగతి వేరే చెప్పాలా!? ‘ట్రిపుల్ ఆర్’లో సీత పాత్రలో నటించి, తెలుగువారి అభిమానం పొందిన అలియా భట్ ఈ మధ్యే తల్లి అయింది. లేకపోతే, ఆమె కూడా చిత్రబృందంతో పాటు పాలుపంచుకొనేవారేమో! బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన రణబీర్ కపూర్ భార్య కాకముందే అభినేత్రిగా అలియా భట్ తనదైన బాణీ పలికించారు. తన అందచందాలతో యువతను మరింతగా ఆకట్టుకున్నారు. అలియాకు పెళ్ళయిపోయినా, ఇప్పటికీ ఆమె కొందరు అభిమానులకు హార్ట్ బీట్ అనే చెప్పాలి.
అలియా భట్ 1993 మార్చి 15న జన్మించారు. ఆమె తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకులు. తల్లి సోనీ రజ్దాన్ ప్రముఖ నటి. వారి జీన్స్ కారణంగానే అలియా మనసు సైతం చిన్నతనంలోనే సినిమా రంగంవైపు పరుగులు తీసింది. ఆరేళ్ళ ప్రాయంలోనే తండ్రి రూపొందించిన ‘సంఘర్ష్’లో నటించింది అలియా. ముంబైలోని జమ్నాబాయి నర్సీ స్కూల్ లో ట్వల్త్ గ్రేడ్ వరకూ చదివాక, అలియా సినిమారంగంలో రాణించాలని నిర్ణయించుకుంది. సంజయ్ లీలా భన్సాలీ ‘బాలికా వధూ’ అనే చిత్రాన్ని రూపొందించాలని భావించి, అందులో 12 ఏళ్ళ అలియాను నాయికగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో 20 ఏళ్ళ రణబీర్ ను కథానాయకుడనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా అటకెక్కింది. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో నాయికగా పరిచయమైంది అలియా భట్. “షాన్ దార్, డియర్ జిందగీ, బద్రీనాథ్ కీ దుల్హనియా, రాజి, గల్లీ బాయ్, గంగూబాయ్ కథియవాడియా, ట్రిపుల్ ఆర్” వంటి చిత్రాలలో మురిపించారు అలియా. రణబీర్ కపూర్ తో కలసి ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1-శివ’ గత సంవత్సరమే విడుదలయింది. అలియా నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ‘డార్లింగ్స్’ కూడా నిరుడు వెలుగు చూసింది. ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లోనూ, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే ఆంగ్ల చిత్రంలోనూ అలియా నటిస్తున్నారు.
Also Read
- Anupama Parameswaran-Bhogi: 'భోగి' ప్రమోషన్స్‌కు అనుపమ దూరం.. కారణం అదేనా?
- Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
- Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
చిత్రమేంటో కానీ, ‘బాలికా వధూ’లో రణబీర్ కపూర్ తో జోడీ కట్టవలసిన అలియా భట్ తరువాత అతని నిజజీవిత భాగస్వామి కావడం విశేషం! గత సంవత్సరం ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న అలియా భట్ నవంబర్ లోనే ఓ పాపకు జన్మనిచ్చారు. పాప పేరు రహా. ప్రస్తుతం ముంబైలోనే భర్తతో కలసి ఉంటున్న అలియా భట్ కు లండన్ లోనూ ఓ ఇల్లు ఉంది. అలియా భట్ రాబోయే చిత్రాలతో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Dalai Lama’s New Address: దలైలామాకు ఢిల్లీలో కొత్త నివాసం.. లూటియన్స్ ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కేటాయించిన కేంద్రం!
-
Duddiilla Sridhar Babu : విమర్శలు పట్టించుకోం.. అభివృద్ధిలో తగ్గేదేలే
-
Gold Rate Today: ఊహించని రీతిలో.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్స్ రేట్స్ ఇవే!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
ట్రెండింగ్
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?