-
షూటింగ్ రీస్టార్ట్ చేసిన విశాల్
కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతున్నందున చిత్రసీమ తిరిగి పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది సౌత్ స్టార్స్ షూటింగ్ ప్రారంభించారు. తాజాగా తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని నెలల ముందే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయిన విషయం తెల్సిందే. తాజాగా […] -
రివ్యూ: పచ్చీస్ మూవీ
ఆ మధ్యలో కొత్త దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సింపుల్ లవ్ స్టోరీస్ తీసేవాళ్ళు. ఆ తర్వాత ఈ కొత్త బ్యాచ్ హారర్ కామెడీస్ మీద పడింది. కథాబలం లేకపోయినా… పది పన్నెండు ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేస్తారని వీళ్ళ నమ్మకం! నిజానికి కొంతకాలం అలానే గడిచిపోయింది. ఇప్పుడేమో వీళ్ళు క్రైమ్ థ్రిల్లర్స్ మీద పడ్డారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయితే ఈ జానర్ మూవీస్ వెల్లువెత్తుతున్నాయి. ఆ జాబితాలోకి చేరేదే […] -
డైరెక్టర్ గా “వకీల్ సాబ్” యాక్షన్ కొరియోగ్రాఫర్
శాండల్ వుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రవివర్మ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఫలితంగా ఆయనకు బాలీవుడ్ లోనూ మంచి పేరు వచ్చింది. ఇప్పటికే ఆయన టాలీవుడ్ లో అజ్ఞాతవాసి, సరైనోడు, వకీల్ సాబ్… బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్, రీస్, కమాండో 3 తదితర చిత్రాలకు స్టార్ హీరోలతో పని చేశారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ రవివర్మ బాలీవుడ్ లో దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి సిద్ధం […] -
థియేటర్ల రీఓపెన్ అప్పుడేనా ?
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం భారీగానే పడింది. దీని కారణంగానే థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్ […] -
కొత్త పెళ్లి కూతురు ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్
తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం […] -
జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న “పీనట్ డైమండ్” ట్రైలర్
సరికొత్త కంటెంట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ “పీనట్ డైమండ్”. ఇటీవల ఈ చిత్రం నుంచి క్రిష్ విడుదల చేసిన ట్రైలర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. తాజాగా “పీనట్ డైమండ్” ట్రైలర్ దాదాపు 1 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ […] -
బుల్లి గౌనులో రష్మిక మందన్న
కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో “గుడ్‌బై” చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. […] -
అరియనా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ… పిక్స్ కూడా బోల్డ్ గానే !
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముందుగా అరియనా మొహం వెల్లడించకుండా “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అని పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని […] -
నటనలో మిథున్ చక్రవర్తి
(జూన్ 16న నటుడు మిథున్ చక్రవర్తి పుట్టినరోజు)ఈ తరం ప్రేక్షకులకు మిథున్ చక్రవర్తి అనగానే ఆయన అభినయించిన తాజా చిత్రాలు గుర్తుకు వస్తాయి. వాటిలో మిథున్ పోషించిన కేరెక్టర్ యాక్టర్, విలన్ రోల్స్ స్ఫురిస్తాయి. ఈ మధ్య వెంకటేశ్, పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రం కూడా మనవాళ్ళకు గుర్తుకొస్తుంది. పలు పరభాషా చిత్రాల తెలుగు అనువాదంలోనూ మిథున్ నటించిన పాత్రలు కనిపిస్తాయి. నిజానికి యావద్భారతాన్నీ తన అభినయంతోనూ, డాన్సుతోనూ అలరించిన ఘనుడు మిథున్ చక్రవర్తి. […] -
రవ్వలాంటి రాజోలు అమ్మాయి
(జూన్ 16న నటి అంజలి పుట్టినరోజు)మునుపటిలా తెలుగమ్మాయిలు చిత్రసీమలో రాణించలేకపోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్రసీమలో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని పరిస్థితుల కారణంగా అయితేనేమి, ఇతరత్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంతగా నటనారంగంవైపు ఆసక్తి చూపించడం లేదు. ఆ సమయంలో శివనాగేశ్వరరావు తెరకెక్కించిన ఫోటో చిత్రంతో అచ్చతెలుగు అమ్మాయి అంజలి పరిచయమయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించిన అంజలి రాగానే తనదైన అభినయంతో ఆకట్టుకుంది. రాజోలు పాప భలే చేస్తుంది […]
తాజావార్తలు
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!