వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముందుగా అరియనా మొహం వెల్లడించకుండా “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అని పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని ఇట్టే గుర్తుపట్టారు. ఆ తరువాత ఆమె అరియాననే అని పేర్కొంటూ మరిన్ని పిక్స్ షేర్ చేశాడు. నన్ను అరియనా చేసిన ఇంటర్వ్యూ “అరియనా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ” పేరుతో శుక్రవారం విడుదల కానుంది అని ప్రకటించాడు. అయితే వర్మతో అరియనా ఇంటర్వ్యూ సంగతి తెలీదు కానీ పిక్స్ మాత్రం బోల్డ్ గానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే… మరికొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ సినిమాలో అరియనా హీరోయిన్ అవుతుంది అని అంటున్నారు.