Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నెలకొల్పుతూ భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది. ‘రామాయణ’ ధాటికి కుప్పకూలిన భారీ చిత్రాల జాబితా చూస్తే ఈ సినిమా ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది:
బాక్సాఫీస్ వద్ద 1,307.35 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో ఉన్న ‘ధురంధర్’ రికార్డును దాటేసి, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలో ‘రామాయణ’ సగర్వంగా అడుగుపెట్టింది. రాకింగ్ స్టార్ యశ్ గతంలో సృష్టించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) 1,215 కోట్ల వసూళ్లను ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే అధిగమించడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (1,230 కోట్లు), ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ (1,042 కోట్లు) లాంటి భారీ చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లు ‘రామాయణ’ వేగం ముందు నిలవలేకపోయాయి కేవలం మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ జపనీస్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ప్రపంచవ్యాప్తంగా సాధించిన 104.18 మిలియన్ డాలర్ల వసూళ్లను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండు వారాలు కూడా నిండకముందే 1400 కోట్ల మార్కును దాటేసిన ‘రామాయణ: పార్ట్ 1’, రాబోయే రోజుల్లో ఇంకెన్ని వేల కోట్ల రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
- Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
- Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
- Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్'తో నరకం చూశా
తాజావార్తలు
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!