కన్నడ భామ రష్మిక మందన్న సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో “గుడ్‌బై” చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇక రష్మిక మొదటి బాలీవుడ్ చిత్రం “మిషన్ మజ్ను”. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. బబ్లీ బ్యూటీ రష్మిక తాజాగా పర్పుల్ డ్రాస్ట్రింగ్ సైడ్ స్ప్లిట్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయింది. ఈ బోల్డ్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రష్మిక “పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్నచిన్న పనులను తన చెంతకు రానివ్వదు అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నందుకే ఇలా గ్లామర్ డోస్ పెంచింది అంటున్నారు. మరి రానురానూ ఈ కన్నడ సోయగం బాలీవుడ్ బ్యూటీస్ కు పోటీ ఇస్తుందేమో చూడాలి.