Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
- బంగాళాఖాతం వైపే వరస తుఫానులు..
- అర్నబ్, మురాసు తర్వాత ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ‘‘అక్వాన్’’..
- ఎల్‌నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ వాతావరణ పరిస్థితులే కారణమని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Akvan: వరస తుఫానులు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ తుఫాను వ్యవస్థలపై వాతావరణ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. గత కొన్ని రోజులు వ్యవధిలోనే మూడు తుఫానులు ఏర్పడటం, ఆ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ వైపే కదలడం అసాధారణంగా కనిపిస్తోంది. అయితే, ఎల్‌నినో (El Niño), ఇండియన్ ఓషన్ డైపోల్ (Indian Ocean Dipole) వంటి వాతావరణ వ్యవస్థలు ఇందుకు కారణమై ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెబుతున్నారు. 1987లో ఎల్‌నినో ఏర్పడిన సమయంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కనిపించినట్లు చెబుతున్నారు. ఈ కాలంలో తుఫానులు ఏర్పడటం సాధారణమే కానీ, తక్కువ వ్యవధిలో ఇలా ప్రతీ తుఫాను ఏపీ వైపు రావడం అసాధారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఏపీ వైపే తుఫానులు రావడానికి కారణం ఏమిటి?
ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పుడు దక్షిణ బంగాళాఖాతం, అల్ప అక్షాంశ ప్రాంతాల్లో తుఫాను వ్యవస్థలు ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని ఐఎండీ చెబుతోంది. ఇలాంటి వ్యవస్థలు తరుచుగా ఏపీ, తమిళనాడు తీరాల వైపు కదులుతాయని తెలుస్తోంది. ప్రస్తుత తుఫాను కూడా ఏపీ వైపు కదలడానికి ఈ వాతావరణ పరిస్థితులే కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషియన్ డైపోల్ కూడా ఈ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
Also Read
- Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
- Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
- Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
నవంబర్ 20న ఏపీని తాకనున్న అక్వాన్ తుఫాను:
నవంబర్ 20న ‘అక్వాన్’ (Akvan) తుఫాను ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనికి ముందు అక్టోబర్ 28న అర్నబ్, నవంబర్ 3న మురాసు తుఫానులు ఏపీ తీరాన్ని తాకాయి. ఏపీ వ్యాప్తంగా తీవ్ర వర్షాలు, వరదలకు కారణమయ్యాయి. ఇప్పుడు మరోసారి అక్వాన్ రూపంలో వాతావరణం ఏపీపై పగబట్టింది. నవంబర్ 20న నెల్లూరు,తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గాలి వేగం గంటలకు 120 నుంచి 130 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈదురుగాలుల వేగం 145 కిలోమీటర్లకు కూడా చేరొచ్చని చెబుతున్నారు. నవంబర్ 17 నాటికి తీవ్ర తుఫానుగా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది.
ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణ, ఒడిశాపై ప్రభావం..
అక్వాన్ తుఫాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. నవంబర్ 19, 20 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ ఒడిశా జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కనిపించొచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత తుఫాన బలహీనపడి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా వైపు కదిలే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
-
Ramayana : బాక్సాఫీస్‌పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!