థియేటర్ల రీఓపెన్ అప్పుడేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ప్రభావం భారీగానే పడింది. దీని కారణంగానే థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంటే ఏప్రిల్ రెండవ వారం నుంచి తెలంగాణలో థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ తెరుచుకునే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలో జూన్ 19 వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాత్రి కర్ఫ్యూ మాత్రం మరో వారం లేదా నెల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే జూలై 1 నుండి థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. కానీ కేవలం యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను ఓపెన్ చేయాలని ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంది. మొదటి వేవ్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను యాభై శాతం సామర్థ్యంతో రీఓపెన్ చేయడానికి అనుమతించిన విషయం విదితమే. తరువాత దశల వారీగా పూర్తి ఆంక్షలు ఎత్తివేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గినా థర్డ్ వేవ్ భయంతో ముందుగానే థియేటర్లలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యాన్ని అనుమతిస్తారు అంటున్నారు. పబ్బులు, జిమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతించవచ్చు.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!