కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అంతర్జాతీయ వేదికపై స్విమ్మింగ్ లో మరోసారి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్‌లో వేదాంత్ రజత పతకాన్ని గెలుచుకోవడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ 15.57.86 సెకన్ల సమయంలో టార్గెట్ ను పూర్తి చేసి, రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనయుడు రజతాన్ని సాధించిన వీడియో క్లిప్‌ను పంచుకున్న మాధవన్… వేదాంత్ స్విమ్మింగ్ కోచ్ ప్రదీప్ కుమార్ తో పాటు సపోర్ట్ అందించినందుకు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి కూడా ధన్యవాదాలు తెలిపాడు.
Read Also : Tiger Nageswara Rao : 5 ఎకరాల్లో భారీ సెట్… కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో “వేదాంత్ ఆర్ మాధవన్ భారత్ తరఫున రజతం గెలుచుకున్నాడు. ప్రదీప్ సార్, #swimmingfederationofindia, అండ్ #ansadxb మీ అందరి ప్రయత్నాలకు ధన్యవాదాలు. మాకు చాలా గర్వంగా ఉంది” అంటూ మాధవన్ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టాడు. వేదాంత్ మార్చి 2021లో లాట్వియా ఓపెన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. గత సంవత్సరం జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు వేదాంత్ ఏడు పతకాలను సాధించాడు. అందులో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు. కాగా ఏప్రిల్ 15 నుండి 19 వరకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ 2022లో మెన్స్ బటర్‌ఫ్లై స్టైల్ 200 మీటర్ల పోటీలో భారత టాప్ స్విమ్మర్ సజన్ ప్రకాష్ స్వర్ణం సాధించాడు. ప్రకాష్ 1.59.27 సెకన్ల సమయంలోనే ఈ ఫీట్ ను సాధించగలిగారు.
❤️❤️🙏🙏🇮🇳🇮🇳 pic.twitter.com/NoFrpcybY5
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2022