Relangi Narasimharao: శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావ! ఉఊ అంటావా మావ!!’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oo Antava Mava Oo Oo Antava Mava: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రధారులు పోషించిన సినిమా ‘ఊ అంటావా మావ! ఉఊ అంటావా మావ!!’. సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు నిర్దేశకత్వంలో ఈ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ”ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ ఇది. మామూలుగా అయితే నేను ఏ కథ అనుకున్నా… దాసరి నారాయణరావుగారి సలహా తీసుకునేవాణ్ణి. ఆయన లేకపోవడంతో తమ్మారెడ్డి భరద్వాజను అప్రోచ్ అయ్యాను. ఆయన సెలక్షన్ మీద నాకు మంచి నమ్మకం. ఆయన సలహాలతో పాటు దర్శకుడు అజయ్, చదలవాడ శ్రీనివాసరావు గారి సూచనలు కూడా తీసుకుని ఈ సినిమా చేశాం. ఫైనల్‌గా ప్రసన్నకుమార్ అనుకున్నట్లు కథ కుదిరింది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ”రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా ‘ఇది మన సినిమా’ అనే భావనతో పని చేశారు. కాశ్మీర్, హైదరాబాద్ ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ జరిపాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హారర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలామందికి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, రఘు కుంచె, సురేశ్ కొండేటి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
-
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!