K. Viswanath: ‘వివేకానంద డే’కు కళాతపస్వి మద్దతు! చివరి సంతకం అదే!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivekananda Day: స్వామి వివేకానంద చికాగోలో 1893 సెప్టెంబర్ 11న ఇచ్చిన ఉపన్యాసం చారిత్రకమైంది. కోట్లాదిమంది హిందువులలో అది చైతన్య జ్వాలను రగిలించింది. చికాగో ప్రయాణానికి కొద్ది నెలల ముందు స్వామి వివేకానంద హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అది సరిగ్గా ఇదే రోజు కావడం విశేషం. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10వ తేదీ అప్పటి హైదరాబాద్ స్టేట్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. వందలాది మంది హిందువులు, నిజాం సంస్థానానికి చెందిన అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ మర్నాడు సికింద్రాబాద్ లోని ప్రజలు వివేకానందను కలిసి 13వ తేదీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వారి కోరిక మేరకు స్వామి వివేకానంద 13వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వామి వివేకానంద తొలి చారిత్రక ప్రసంగం చేసిన ఫిబ్రవరి 13ను ‘వివేకానంద డే’గా గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కొంతకాలంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.
కె. విశ్వనాథ్ చివరి సంతకం దానిపైనే!
ఇదిలా ఉంటే… కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూయడానికి కొద్ది రోజుల ముందే ఈ వాలంటీర్లు ఆయనను కలిశారు. ‘వివేకానంద డే’ ఆవశ్యకత గురించి ఆయనకు వివరించారు. వారి మాటలను ఆలకించిన కె. విశ్వనాథ్ సంతోషంగా వారికి మద్దతు పలుకుతూ దానికి సంబంధించిన పోస్టర్ పై సంతకం చేశారు. ‘సంతకం చేసి కాలం అయినందువల్ల తన చేతులు అంతగా సహకరించడం లేదని విశ్వనాథ్ గారు తమతో అన్నారని, ఓపిక కూడగట్టుకుని సంతకం పూర్తి చేశారని, మంచి కార్యక్రమం చేస్తున్నారని నిండుమనసుతో తమను అభినందించార’ని ఈ సంతకాన్ని సేకరించిన రామకృష్ణ మఠం వాలంటీర్, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ తెలిపారు. వివేకానంద స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో అవసరమని ఆ సందర్భంగా విశ్వనాథ్ అన్నారని చెప్పారు. ఇవాళ వివేకానంద తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టిన రోజు కావడంతో ఇటీవలే జరిగిన ఈ సంఘటన గుర్తొచ్చిందని అన్నారు.

Also Read
తాజావార్తలు
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?