Samantha: ‘శాకుంతల’ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చేశారుగా….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaakuntalam: స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ కొత్త విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 14న రాబోతోందని తెలిపారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ‘శాకుంతలం’ లో టైటిల్ రోల్ ను సమంత పోషించింది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాల భరతుడి పాత్రలో మెరిసింది. మణిశర్మ స్వరరచన చేసిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రీడీలోనూ విడుదల చేయబోతున్నారు.
భారీ చిత్రాలతో పోటీ!
‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోందనే ప్రకటన రాగానే ఫిల్మ్ ట్రేడ్ వర్గాలలో కొత్త సందేహం మొదలైంది. ఇది పాన్ ఇండియా మూవీ, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 14న ఇప్పటికే పలు చిత్రాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. అందులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ కూడా ఉంది. అలానే రజనీకాంత్ ‘జైలర్’ మూవీ సైతం అదే తేదిన విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇక లారెన్స్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రుద్రుడు’ కూడా అదే తేదీకి వస్తుందనే ప్రకటన ఇప్పటికే వచ్చింది. తెలుగులో అల్లరి నరేశ్ నటిస్తున్న ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ కూడా అదేనని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. వీటిలో ‘జైలర్’ మూవీ రిలీజ్ వాయిదా పడొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి మిగిలిన సినిమాల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన, ‘శాకుంతలం’ మాత్రం మరోసారి వాయిదా పడకుండా అదే తేదీకి వస్తుందేమో చూద్దాం.
Also Read
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!