Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రాష్ట్రాన్ని చల్లబరుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించింది.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో, దాదాపు నగరం మొత్తం వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
Also Read
సిద్దిపేట జిల్లా ముత్స్యాలలో అత్యధికంగా 12.3cm వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నాగర్‌కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, వరంగల్ హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?