Postal Department: హైదరాబాద్ జిల్లా వినియోగదారులకు ఫోరం పోస్టల్ శాఖ షాక్ ఇచ్చింది. పార్శిల్ తారుమారు చేసి అందులోని వస్తువులు మాయమైన ఘటనపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం కోర్టు.. పోస్టల్ శాఖకు జరిమానా విధించింది. కస్టమర్ కు రూ.20 వేలు పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్ ను ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ గతేడాది ఇండియా పోస్ట్ ద్వారా చీరలు, బెడ్ షీట్లు, షర్టులు, ప్యాంట్లు, మెడికల్ బుక్స్, ప్లాస్టిక్ కంటైనర్లతో కూడిన నాలుగు ప్యాకెట్లను హరిద్వార్ కు పంపారు. అయితే అతడు పంపిన సరుకులు ఆర్డర్ చేసిన చోటికి వెళ్లగా రూ.20 వేల విలువైన పది చీరలు మాయమయ్యాయి. తాను పంపిన ప్యాకెట్లను ఇండియా పోస్ట్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారని ఆరోపిస్తూ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ మేరకు జిల్లా వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది.
అయితే.. వీకే సింగ్ ఫిర్యాదును ఇండియా పోస్ట్ తోసిపుచ్చింది. సరుకులు సక్రమంగానే పంపామని, ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. సరుకులు పంపేటప్పుడు వాటి విలువను ప్రకటించలేదని, ఇన్సూరెన్స్ చేయలేదని చెప్పింది. ఇండియా పోస్ట్ వాదనతో ఫిర్యాదుదారు VK సింగ్ ఏకీభవించలేదు. పార్శిళ్లు పంపుతుండగా వీడియో తీశానని.. డెలివరీ అయిన తర్వాత వీడియో కూడా తీశానని.. ఆ రెండు వీడియోల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టమవుతోందని అన్నారు. ఈ మేరకు ఆ వీడియోలను వినియోగదారుల ఫోరంకు అందజేశారు. గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఫిర్యాదుదారు వాదనతో ఏకీభవించిన వినియోగదారుల ఫోరం.. పంపిణీ సమయంలో సరుకులు పోతే తపాలా శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు రూ. 20 వేలు నష్టపరిహారం, ఫిర్యాదు ఖర్చుల కింద మరో 5 వేలు చెల్లించాలని పోస్టల్ శాఖను ఆదేశించింది.
మరోవైపు హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ కు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.10 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.. మెట్రో స్టేషన్‌లో రూ. 10. అదనంగా వసూలు చేశారన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఈ మేరకు జరిమానా విధించింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో ఒకవైపు నుంచి మరో వైపుకు ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10ని వాపసు ఇవ్వాలని మెట్రో సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే..
Talasani: దేశంలో ఇలాంటి ఇల్లు చూపించండి.. రాజీనామా చేస్తా..!