అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా అయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ తో ఈ వందరోజుల్లో ఎలాంటి బంధం బలపడిందో వివరించారు. వంద రోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందని, ఇటీవలే ప్రధాని మోడీతో తాను మాట్లాడానని తెలిపారు. అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి […]
కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది. వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు. ఇళ్లను […]
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర […]
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కరోనా బారిన […]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోబోతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక […]
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు ఆరువేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు. కరోనా […]
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,95,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో 1,32,76,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,57,538 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,67,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో రికార్డ్ స్థాయిలో 2023 మంది […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా […]
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య తరువాత దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో ప్రజలు ఉద్యమించారు. లాఠీ ఛార్జ్, కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును అమెరికా కోర్టు వెలువరించింది. 12 మంది సభ్యులతో కూడిన […]