మనదేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే, 60 నుంచి 70 శాతం ఈ వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఇండియాలో జూన్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో దీని ధర […]
కోవిడ్ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ. తెంగాణతో సహా రాష్ట్రాలు పరిమిత లాక్‌డౌన్లు కర్ఫ్యూు ఇతర ఆంక్షలు విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో మోడీ మాట్లాడుతున్నారంటే దేశమంతా చెవులు రిక్కించి వినేది. టీవీ సెట్ల ముందు జనం గుమికూడేవారు. కాని ఇప్పుడు రెండవసారి కరోనా దాడి తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. దవాయి భీ కడాయి బీ మందు తీసుకోవాలి,ముందు జాగ్రత్త వుండాలి అని ఆయన జాతికి […]
ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు […]
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, దేశంలో వ్యాక్సినేషన్, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 […]
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న టీకాలను వేగవంతం చేశారు. టీకాలను వేగంగా అందిస్తూ కరోనా కట్టడి చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే, టీకాలపై అవగాహన కలిగిస్తూనే కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజాపూర్ […]
ఇండియాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వారు వీరు అనే తేడా లేదు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారికి కరోనా సోకుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇదిలా […]
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది. అయితే, పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ […]
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. అయితే, ఈరోజు రాత్రి నుంచి మే 1 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలు సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ, గ్యాస్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు యధావిధిగా నడుస్తాయి. […]