దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతున్నది. ఇప్పటికే అనేక మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటుగా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు ఇద్దరు కరోనా బారిన […]
కరోనా మొదటి దశలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు వందలాది కిలోమీటర్ల మీద నడిచి స్వస్థలాలకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి వలస కూలీలు నగరం బాట పట్టారు. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ మహమ్మారి ఉదృతి భీభత్సంగా ఉంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల రేటు […]
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. […]
మే 1 వ తేదీ నుంచి దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాబోతున్నది. మూడో విడత వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రకటనను నిన్నటి రోజున కేంద్రం రిలీజ్ చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరికి వ్యాక్సిన్ వేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండో విడత వ్యాక్సినేషన్ లో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నామమాత్రపు ధరలతో […]
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా, […]
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి భయానకంగా మారింది. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇంకా భయం వెంటాడుతూనే ఉన్నది. పైగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఇబ్బందులు పెడుతున్నది. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందించాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తగినన్ని వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించినా వ్యాక్సిన్ లేమి కారణంగా అరకొరగా మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. వ్యాక్సిన్ కొరతకు […]
దినఫలం మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని […]
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. విద్యాలయాలు కరోనా వ్యాప్తికి కారణమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్ళీ రాదనే గ్యారెంటీ లేకపోవడంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటె, స్పెయిన్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉన్నదో చూశాం. గతంలో ఆ దేశంలో పెద్ద […]
కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఢిల్లీలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎప్పుడు లేని విధంగా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. దీంతో కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. పైగా ఆ రాష్ట్రంలో […]
ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇక ఇండియాలో రోజువారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొదటి 25 లక్షల కేసులు నమోదవ్వడానికి 198 రోజుల సమయం పడితే, చివరి 25 లక్షల కేసులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి […]