కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ ను సెర్చ్ చేస్తాం. అయితే, ట్విట్టర్ తో నిత్యం టచ్ లో ఉండే వ్యక్తులు కొత్త విషయాల కోసం ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్ ను సెర్చ్ చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలతో పాటుగా అప్పుడప్పుడు మెదడకు పదును పెట్టె క్విజ్ లను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఓ గోళం, దానికి నాలుగు తీగలు ఉన్న […]
ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. […]
తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. దీంతో చెక్ పోస్టుల […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగదారులతో కళకళలాడేవి. కానీ, ఈ ఏడాది గోల్డ్ షాపులు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. తెలంగాణలో ఉదయం పది గంటల వరకే షాపులకు అనుమతి ఉండటం, అటు ఆంధ్రప్రదేశ్‌లో మద్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచి ఉండటంతో వినియోగ దారులు పెద్దగా కొనుగోలు చేసేందుకు […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా […]
పింక్ సిటీగా పేరు తెచ్చుకున్న జైపూర్ నగరానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ నగరంలో 2008, మే 13 వ తేదీన ఉగ్రవాదులు వరస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నగరంలో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 71 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ సిటీలో 15 నిమిషాల వ్యవధిలో 8 చోట్ల ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. సాయంత్రం సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో మరణాలు అధికంగా సంభవించాయి. జైపూర్ లో […]
తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు. సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను నిర్వహించారు. లాక్ డౌన్ ను ప్రజలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావొద్దని అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్ధనలు జరుపుకోవాలని తెలిపారు. మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇంట్లో జరిగే ప్రార్థనల్లో కూడా […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. కరోనా మహమ్మారి తో అమెరికా అతలాకుతలం అయ్యింది. కరోనా నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున అక్కడ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి 1 మిలియన్ డాలర్లు బహుమానంగా […]
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది. అయితే, దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం, థర్డ్ వేవ్ చిన్నారిపై ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు హెచ్చరించడంతో చిన్నారుల్లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం భారత్ బైయోటెక్ కంపెనీ చిన్నారుల వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డిసీజీఐ అనుమతి ఇచ్చింది. 525 […]
తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు […]