144Hz AMOLED డిస్ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- ఇన్ఫినిక్స్ Note 60 Pro భారతదేశంలో అధికారికంగా లాంచ్
- 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
- Snapdragon 7s Gen 4 ప్రాసెసర్, 3D VC కూలింగ్ సిస్టమ్, 360° గేమింగ్ యాంటెన్నా సపోర్ట్
- భారీ 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్
- 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 13MP ఫ్రంట్ కెమెరా
- IP64 రేటింగ్, Gorilla Glass 7i ప్రొటెక్షన్
- ప్రారంభ ధర రూ. 31,999 (8GB+128GB), రూ. 34,999 (8GB+256GB), బ్యాంక్ ఆఫర్లతో 3000 వరకు డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Note 60 Pro Launched: భారతదేశంలో కొత్తగా ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ 60 ప్రో (NOTE 60 Pro) మోడల్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచేలా ఫీచర్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్, స్లిమ్ బార్డర్లు, కర్వ్డ్ ఎడ్జ్‌లతో స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. సైడ్‌లో ఉన్న One-Tap బటన్ ద్వారా హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, HRV వంటి హెల్త్ మెట్రిక్స్‌ను ట్రాక్ చేయవచ్చు.
CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్‌లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!
Also Read
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
వీటితోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చిమ్మరింపుల నుంచి రక్షణ లభిస్తుంది. JBL ట్యూనింగ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ఉన్న యాక్టీవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే వెలిగుతూ నోటిఫికేషన్లు, యానిమేషన్లు, మినీ గేమ్స్ చూపిస్తుంది.
ఈ కొత్త నోట్ 60 ప్రో లో 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ అనుభవం లభిస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అల్ట్రా-న్యారో బెజెల్స్‌తో విజువల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. ఇక ఫోన్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3D VC కూలింగ్ సిస్టమ్, 360° గేమింగ్ యాంటెన్నా ద్వారా హీట్ కంట్రోల్, సిగ్నల్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది. Call of Duty Mobile వంటి గేమ్స్‌లో 120fps సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఇందులో 6500mAh భారీ బ్యాటరీ ప్రధాన హైలైట్. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. “సెల్ఫ్-రిపేరింగ్” టెక్నాలజీతో బ్యాటరీ దీర్ఘకాలం ఆరోగ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Ultra HDR టెక్నాలజీతో సహజమైన ఫోటోలు తీసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. FOLAX AI అసిస్టెంట్ ద్వారా స్క్రీన్ అనాలిసిస్, ట్రాన్స్‌లేషన్, సమ్మరైజేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 3 ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
ఈ మొబైల్ సోలార్ ఆరంజ్, మొఛా బ్రౌన్, డీప్ ఓషన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ధర రూ. 31,999 (8GB+128GB) నుండి ప్రారంభమవుతుంది. 8GB+256GB వేరియంట్ ధర రూ. 34,999గా ఉంది. ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ. 3000 తగ్గింపు, ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ. 2000 డిస్కౌంట్, రూ. 3999 విలువైన MagPower స్పీకర్ ఉచితం, ఒక సంవత్సరం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!