మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
- కొత్తగా OPPO A6s Pro ను చైనాలో లాంచ్
- గత ఏడాది వచ్చిన A6 Pro కు సక్సెసర్‌గా ఈ ఫోన్ విడుదల
- 6.57 అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే, 1400 నిట్స్ బ్రైట్‌నెస్
- మీడియాటెక్ డిమెన్సిటీ 6360 ప్రాసెసర్
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
- 50MP మెయిన్ కెమెరా + 2MP మోనోక్రోమ్ సెన్సార్, 16MP ఫ్రంట్ కెమెరా
- 7000mAh భారీ బ్యాటరీ + 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ ఒప్పో (OPPO) చైనా మార్కెట్‌లో కొత్తగా ఒప్పో A6s ప్రో (OPPO A6s Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన A6 Proకు సక్సెసర్‌గా ఈ ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.57 అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఇవ్వబడింది. అలాగే ఇది 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు 100% DCI-P3 కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండటం వల్ల విజువల్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. ఇది మీడియాటెక్ డిమెంసిటీ 6360 మాక్స్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది.
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్.. కమిన్స్ వచ్చేస్తున్నాడు..
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
OPPO A6s Pro మొబైల్ లో 4300mm² VC కూలింగ్ సిస్టమ్ తో ఎక్కువ సమయం మొబైల్ హీట్ కాకుండా మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ప్రత్యేకతల్లో ప్రధానంగా దాని డ్యూరబిలిటీ ఒకటి. IP66, IP68, IP69, IP69K వంటి రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. 85°C ఉష్ణోగ్రతలో కూడా ప్రెషర్ వాటర్ జెట్స్‌ను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్ టెస్టులను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.
కెమెరా పరంగా చూస్తే ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇక బ్యాటరీ చూస్తే.. ఇందులో ఏకంగా భారీ 7000mAh బ్యాటరీతో పాటు 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. “రైజింగ్ టు ప్రొమినెన్స్ (Rising to Prominence)” వేరియంట్‌లో 3D Depth-of-Field లైట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించగా.. మరోక “గుడ్ లక్ లోటస్” వేరియంట్‌లో ఫాంటమ్ కలర్ LCD టెక్నాలజీ వినియోగించారు. అలాగే “మూన్ షైన్ బ్లూ” కలర్ నైట్ స్కై నుండి ప్రేరణ పొందింది.
ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ.30,000 (2199 యువాన్) కాగా, 8GB + 256GB రూ.32,700, 12GB + 256GB రూ.36,800, 12GB + 512GB వేరియంట్ రూ.40,900 వరకు ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో ఏప్రిల్ 17 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇక భారత మార్కెట్‌లో ఈ ఫోన్ ఒప్పో F33 ప్రో పేరుతో ఏప్రిల్ 15న విడుదల కానుంది. దీంతో భారత వినియోగదారులకు కూడా ఈ ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..