మధ్యప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ సమయంలో సమ్మె కరెక్ట్ కాదని, సమ్మె విరమించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తు దాదాపుగా మూడు వేలమంది జూనియర్ డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ఆరు ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యులు రాజీనామాలు చేసి వాటిని కాలేజీ డీన్‌కు అందజేశారు. ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి సోకితే తమకు, కుటుంబాలకు ఇచ్చే స్టైఫండ్ పెంచాలని, ఉచిత చికిత్స అందించాలని జూనియిర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు.