నాసా మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. అరుణగ్రహంపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్రగ్రహంమీదకు మళ్లించింది. శుక్రగ్రహంపైకి రెండు వ్యోమనౌకలను పంపించేందుకు సిద్దమైంది నాసా. శుక్రగ్రహంమీద ఉష్ణ్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి కరిగిపోతుంది. భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేయబోతున్నది. ఈ వేడి గురించి తెలుసుకోవడానికి నాసా రెండు వ్యోమనౌకలను సిద్దం చేస్తున్నది. డావించి, వెరిటాన్ పేరుతో ఈ నౌకలు సిద్దం అవుతున్నాయి. డావించి శుక్రగ్రహంపై ఉండే వాతావరణంపై పరిశోధనలు చేసేవిధంగా, వెరిటాన్ ను శుక్రగ్రహాన్ని మ్యాపింగ్ చేసేందుకు అనువుగా తయారుచేస్తున్నారు. వీటిని 2028 లేదా 2030లో ప్రయోగించే అవకాశం ఉన్నది.