ఢిల్లీలో కేసులు కనిష్టస్థాయికి చేరుకోవడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢల్లీలో మాములు సమయంలో నిత్యం రద్ధీగా కనిపించే కానాట్‌ప్లేస్, కరోల్‌భాగ్ ఏరియాల్లో చిన్న వ్యపారాల నుంచి వ్యాపారసముదాయాల వరకు అన్ని తెరుచుకున్నాయి. కానీ, కరోనా భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మాల్స్ వెలవెలబోయాయి. అటు రోడ్లు సైతం బోసిపోయి కనిపించాయి. కరోనా భయం నుంచి ప్రజలు ఇంకా కొలుకోలేదని, త్వరలోనే జీవనం యధావిధిగా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు.